Current Affairs Telugu Daily

శ్రీనగర్‌లో పత్రికా సంపాదకుడు సుజాత్‌ బుఖారీ హత్య 
సీనియర్‌ జర్నలిస్టు, రైజింగ్‌ కశ్మీర్‌ సంపాదకుడు సుజాత్‌ బుఖారీ(50)ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
  • ఆయన వ్యక్తిగత భద్రత అధికారిని కూడా వారు కాల్చి చంపారు. శ్రీనగర్‌లోని ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన కార్యాయలం నుంచి ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యేందుకు ఆయన బయటకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
  • బుఖారి గతంలో హిందూ వార్తా పత్రికకు కశ్మీరులో కరస్పాండెంట్‌గా పని చేశారు.
  • కశ్మీరు లోయలో శాంతి కోసం పలు సదస్సు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌తో ప్రత్యామ్నాయ చర్చ ప్రక్రియలోనూ భాగంగా ఉన్నారు.
  • 2000 సంవత్సరంలో కూడా ఆయనపై దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయనకు పోలీసు భద్రత కల్పించారు.
  • సుజాత్‌ బుఖారీ బుంద్‌ కాశ్మీర్‌ అనే ఉర్దూ పత్రికను కూడా స్థాపించి దానికి కూడా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు
జమ్ముకశ్మీరు ముఖ్యమంత్రి- మెహబూబా ముఫ్తీ
జమ్ముకశ్మీరు గవర్నర్‌ - నరేంద్రనాథ్‌ వోహ్రా (ఎన్‌.ఎన్‌.వోహ్రా)
జమ్ముకశ్మీరు రాజధానులు - శ్రీనగర్‌ (వేసవి), జమ్ము (శీతాకాలం)

views: 872

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams