Current Affairs Telugu Daily

కశ్మీర్‌పై ఐక్యరాజ్య సమితి నివేదిక
కశ్మీర్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK)లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ.. ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేయడంతో భారత్‌ ఘాటుగా స్పందించింది.
  • ఐక్యరాజ్య సమితి 2018 జూన్‌ 14న విడుదల చేసిన ఈ నివేదికలో అక్కడి పరిస్థితులపై అంతర్జాతీయ విచారణకు డిమాండ్‌ చేసింది.
  • ఐక్యరాజ్య సమితితో విభేదించిన భారత్‌-అది ‘అవాస్తవమైన.. వివాదాస్పద.. ప్రేరేపిత..’ నివేదికగా పేర్కొంది. విశ్వసనీయతను దిగజార్చుకునేలా ఐక్యరాజ్య సమితి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదిస్తోందంటూ మండిపడింది.
  • ‘‘నివేదిక భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించేలా ఉంది. జమ్మూ-కశ్మీర్‌ మొత్తం భారత్‌లో అంతర్భాగం. భారత రాష్ట్రంలోని ఓ ప్రాంతంపై పాకిస్థాన్‌ అక్రమంగా,  దురాక్రమణకు పాల్పడింది..’’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
  • ‘జమ్మూ-కశ్మీర్‌ (కశ్మీర్‌ లోయ, జమ్మూ, లద్దాఖ్‌ ప్రాంతాలు), పాక్‌-పరిపాలనలోని కశ్మీర్‌ (ఆజాద్‌ జమ్మూ, కశ్మీర్‌బీ గిల్‌గిత్‌-బాల్టిస్థాన్‌)లో మానవ హక్కుల పరిస్థితి’ అని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం 49 పేజీ నివేదికను విడుదల చేసింది.
  • ఇందులో ఐక్యరాజ్య సమితి ‘ఆజాద్‌ జమ్మూ, కశ్మీర్‌, గిల్‌గిత్‌-బాల్టిస్థాన్‌’ అని ప్రస్తావించడాన్ని భారత్‌ ఆక్షేపించింది. భారత ప్రాదేశిక భాగాన్ని తప్పుగా వివరించడం ఆమోదయోగ్యం కాదని ఖండించింది.
  • ఉగ్రవాదమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కాగా నివేదిక రచయితలు పాక్‌లోనూ, ఆ దేశ దురాక్రమిత ప్రాంతాల్లోనూ పాక్‌ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పట్టించుకోలేదని మండిపడింది.  
నివేదికలోని అంశాలు  
  • ‘‘భారత రాష్ట్రమైన జమ్మూ-కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకుశిక్షలు లేకపోవడం..న్యాయం కొరవడటం ప్రధాన సవాళ్లు. సైనిక దళాల (జమ్మూ-కశ్మీర్‌) ప్రత్యేక అధికారాల చట్టం-1990, జమ్మూ-కశ్మీర్‌ ప్రజా భద్రత చట్టం-1978 వంటివి సాధారణ న్యాయ పరిస్థితులకు ఆటంకం కలిగిస్తున్నాయి.
  • జవాబుదారీతనం లేకపోవడం, బాధితులు పరిహారం పొందే హక్కు ప్రమాదంలో పడటం వంటివి మానవ హక్కుల ఉల్లంఘనే. కశ్మీర్‌లో తగిన శిక్షలు లేకపోవడంతో నేరం చేసిన వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు.’’
  • అని ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొంది. 2016 నుంచి భద్రత దళాలు హద్దు దాటి ప్రవర్తించిన సంఘటనలు, కశ్మీర్‌లోని పరిస్థితులను నివేదికలో ప్రస్తావించింది.
  • ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించి రాజకీయ పరిష్కారానికి సరైన సూచనలే చేసిందని పాక్‌ విదేశీ కార్యాలయం పేర్కొంది.
POK- Pak Occupied Kashmir 

views: 863

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams