Current Affairs Telugu Daily

గల్ఫ్‌ వెళ్లే మహిళల కొరకు ఓంక్యాప్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం
పేదరికం నుంచి బయటపడేందుకు గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్లే రాష్ట్ర మహిళలకు సంపూర్ణ భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓం క్యాప్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 
  • ఓం క్యాప్‌తో ఒప్పందం చేసుకున్నందున ఆ సంస్థ అధికారికంగా గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలపై సమాచారం ఇస్తుంది.
  • అక్కడి యజమాన్యాలతోనూ, సంస్థలతోనూ ఓంక్యాప్‌ ఒప్పందం చేసుకుంటుంది. అధికారికంగా ఉద్యోగ భర్తీ చేపడుతుంది.
  • ఫలితంగా మహిళలు చట్టపరంగా పాస్‌పోర్టులూ, వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళతారు. అక్కడి చట్టా నుంచి రక్షణ పొందుతారు. యజమానులు చిత్రహింసలకు గురిచేయకుండా వీరికి చట్టపరంగా భద్రత ఉంటుంది.

views: 1038



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams