Current Affairs Telugu Daily

కేరళలో పెళ్ళిళ్లూ పర్యావరణహితంగా... 
ఇకనుంచీ కేరళలో అంతటా వివాహాలన్నీ కూడా పర్యావరణహితంగా ఉండాలి. పచ్చటి తోరణాలు...పుష్పాలు...ఫలాలే కాదు...విందు భోజనాలను వడ్డించే ప్లేట్లు, కప్పులు, మంచినీళ్ల సీసాల విషయంలోనూ పర్యావరణహితమైన పద్ధతులు పాటించాల్సిందే. ఈ మేరకు కేరళ ప్రభుత్వం హరిత మార్గదర్శకాలతో సిద్ధమైంది. ఇలాంటి ‘పచ్చని’ పెళ్లిళ్లు చేసుకునే వారికి సంబంధిత పాలనా యంత్రాంగాలు ‘హరిత వివాహ పత్రాన్ని’ అందచేస్తాయి. ఇకపై పెళ్లిళ్లలో ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వాడకం నిషిద్ధం. ఇతర అలంకారాల్లో ఎక్కడా కూడా థెర్మోకోల్‌, ప్లాస్టిక్‌లను వాడకూడదు. వాటి బదులుగా పర్యావరణానికి కీడుచేయని వస్తువులనే వాడాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై శుభకార్యాలు జరిగే మంటపాలు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతను ‘సుచిత్వ మిషన్‌’ స్వీకరించింది. ఇప్పటికే ఎర్నాకులం, కొల్లం, అలప్పుళ, కన్నూర్‌ తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు.
views: 1128

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams