Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ రచయిత షాజహాన్‌ బచ్చూ హత్య
బంగ్లాదేశ్‌ రచయిత, పబ్లిషర్‌ షాజహాన్‌ బచ్చూను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. తుపాకులతో ఆయన్ను కాల్చిచంపారు.
  • లౌకికవాద సిద్ధాంతాలను షాజహాన్‌ ప్రచారం చేసేవారు. షాజహాన్‌ బచ్చూ కవిత్వ ప్రచురణకు పేరుగాంచిన ‘బిశాక ప్రొకాషోనీ’ అనే సంస్థను నడిపేవారు.
  • గతంలో బంగ్లాదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ ముంశీగంజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
  • 2018 జూన్‌ 11న తన స్వగ్రామంలో ఉండగా.. ఐదుగురు దుండగులు ఆయనపై దాడి చేశారు. స్నేహితులను కలిసేందుకు ఓ ఔషద దుకాణం వద్దకు ఆయన వెళ్లారు.
  • అక్కడికి నిందితులు రెండు మోటార్‌ సైకిళ్లపై వచ్చి.. దుకాణం బయట చమురు బాంబును పేల్చి గందరగోళం సృష్టించారు.
  • ఆ తర్వాత షాజహాన్‌ను బయటకు ఈడ్చుకువచ్చి కాల్చిచంపారు. లౌకికవాదానికి మద్దతుగా ఉన్నందుకు గతంలోనూ షాజహాన్‌కు ఉగ్రసంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.
  • ముస్లిం ఆధిక్య దేశమైన బంగ్లాదేశ్‌లో లౌకికవాద రచయితలు, ఉద్యమకారులు హత్యలు గత మూడేళ్లుగా ఎక్కువయ్యాయి. 

views: 1063

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams