Current Affairs Telugu Daily

ఆధ్యాత్మిక గురు భయ్యూ మహారాజ్‌ ఆత్మహత్య 
ఆధ్యాత్మిక గురుగా పేరొందిన భయ్యూ మహారాజ్‌ (50) 2018 జూన్‌ 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భయ్యూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విశేష ప్రజాదరణ పొందారు.
  • ఆయన అసలు పేరు ఉదయ్‌సింగ్‌ దేశ్‌ముఖ్‌. 2018 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు సాధువులకు సహాయ మంత్రి హోదాను ప్రకటించింది.
  • ఆ ఐదుగురు సాధువుల్లో భయ్యూ ఒకరు కాగా.. ఆ హోదాను ఆయన తిరస్కరించారు. గతంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన నిరాహార దీక్షను విరమింపజేసేందుకు నాటి యూపీయే ప్రభుత్వం భయ్యూనే పంపించింది.
  • ప్రధాని మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సద్భావన ఉపవాస దీక్షకు కూడా ఆయనను ఆహ్వానించారు.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, శరద్‌ పవార్‌, ఉద్ధావ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రముఖ గాయనీమణులు తా మంగేష్కర్‌, ఆశా భోంస్లే తదితరులెందరో ఆయనను ఆధ్యాత్మిక గురుగా గౌరవిస్తుంటారు.  
  • ఆధ్యాత్మిక గురు కాకముందు భయ్యూ మోడలింగ్‌లో ఉండేవారు. ఆయన మొదటి భార్య మాధవి 2015 నవంబరులో చనిపోగా.. 2017 ఏప్రిల్‌లో డాక్టర్‌ ఆయుషి శర్మను మళ్లీ వివాహం చేసుకున్నారు.
  • ఆ సమయంలోనే నటిగా చెప్పుకొనే ఓ మహిళ తనను భయ్యూ మోసం చేశారంటూ ఆరోపించారు.
  • భయ్యూకు మొదటి భార్యకు పుట్టిన కుమార్తె ఉన్నారు. 2016లో ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌భగవత్‌, ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు అప్పట్లో పరామర్శించారు. భయ్యూ మహారాజ్‌ ఎప్పుడూ మెర్సిడెస్‌లోనే ప్రయాణించేవారు.
  • రోలెక్స్‌ వాచీ లేకుండా ఆయనను చూడటం అరుదు. ఇండోర్‌లో ఆయనకు విశాలమైన బంగ్లా ఉంది. 

views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams