Current Affairs Telugu Daily

అంతరిక్షంలో మరో రెండు కొత్త గ్రహ వ్యవస్థలు
స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఒవియైడోబీ ఇన్‌స్టిట్యూటో డె ఆస్ట్రోఫిసికా డె కనారియాస్‌ పరిశోధకులు అంతరిక్షంలోని రెండు కొత్త గ్రహ వ్యవస్థలను కనుగొన్నారు.
  • ఇందులో ఒకటి సూర్యునికి 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కె2-239 నక్షత్ర కుటుంబం.
  • దీని చుట్టూ భూపరిమాణంలో ఉండే 3 గ్రహాలు పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • ఒకసారి అవి తమ నక్షత్రం చుట్టూ తిరిగిరావడానికి వరుసగా 5.2, 7.8, 10.1 రోజులు పడుతున్నట్లు అంచనా వేశారు.
  • కె2-240గా పిలిచే మరో మరుగుజ్జు నక్షత్రం చుట్టూ భూమి కంటే పెద్దవైన 2 గ్రహాలు పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు.
  • వీటి ఉష్ణోగ్రతలు 3,450, 3,800 కెల్విన్‌ మేర ఉంటుందని, ఇది వాటి నక్షత్ర ఉష్ణోగ్రతలో దాదాపు సగమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
  • జరాఫియాలోని ఆర్‌ఐఎంవో పరిశోధన కేంద్రంలోని గ్రాన్‌ టెలీస్కోపియో కనారియాస్‌ (జీటీసీ) ద్వారా శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు.
  • ఐరోపాలోని దక్షిణాది పరిశోధన కేంద్రం (ఈఎస్‌వో)లో ఉన్న అత్యంత భారీ టెలీస్కోప్‌ (వీఎల్‌టీ) ద్వారా ఈ గ్రహా లక్షణాలను కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నట్లు ‘మంత్లీ నోటీసెస్‌ ఆఫ్‌ ద రాయల్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ’ తాజా సంచికలో వెల్లడించింది.

views: 1030

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams