Current Affairs Telugu Daily

విద్యాహక్కు చట్టంపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం
దేశంలో విద్యాహక్కు చట్టం అమలుపై ప్రపంచబ్యాంకు అధ్యయనం చేపట్టింది.
  • విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కల్పించే ప్రయోజనాలు ఇంకా లక్షిత వర్గాలకు అందలేదని, చట్టాన్ని అమలు చేయాలంటూ న్యాయస్థానాల్లో వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతుండడమే ఇందుకు నిదర్శనమని ప్రపంచ బ్యాంకు అధ్యయనం వెల్లడించింది.
  • విద్యాహక్కు చట్టం 2010 నుంచి అమల్లోకి రాగా, ఇంతవరకు 41,343 కేసు దాఖలయ్యాయి.
  • ఇందులో 2,477 కేసులు సుప్రీంకోర్టు పరిశీలనకు వెళ్లాయి. చట్టం ప్రకారం ప్రముఖ ప్రయివేటు పాఠశాలల్లో పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది.
  • ఈ హక్కు అమలుపైనే అధికంగా కేసులు దాఖలయ్యాయి. ఉపాధ్యాయుల అర్హతలు, పాఠశాలల గుర్తింపుపై చట్టంలో పేర్కొన్న నిబంధనను సవాలు చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు.
  • ఈ చట్టం ప్రకారం పిల్లల హక్కును కాపాడాలంటూ డిల్లీకి చెందిన సామాజిక న్యాయవాదులు 500కు పైగా కేసు వేశారు.
  • విద్యా హక్కు చట్టం అమలు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు ఉన్నప్పటికీ, వాటికి తగినంతమంది సిబ్బందిని నియమించలేదు.
  • అందుకే చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. చట్టంలోని నిబంధను సరళీకృతంగా ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
  • ప్రయివేటు విద్యాసంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన ఆ సౌకర్యం పేదలకు అందడం లేదని అధ్యయనంలో తేలింది.
  • బడుగువర్గాల్లోని స్థితిమంతులకే ఆ ప్రయోజనం అందుతోందని, సొమ్ము ఖర్చు చేసి కోర్టుకు వెళ్లయినా సరే సీట్లు పొందుతున్నారని గుర్తించింది.
  • పేదింటి పిల్లలకు ఈ విద్యాసంస్థల్లో సీట్లు ఇవ్వడంపై మధ్యతరగతి వారు అభ్యంతరం తెలుపుతున్నారు. తమ పిల్లలు పేదవారితో కలిసి ఉండడం వారికి ఇష్టం లేదు.
  • రిజర్వేషన్ల కోటాలో ఇచ్చే సీట్లకు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నా, ఆ సొమ్ము పాఠశాలలు వసూలు చేసే బోధన రుసుముకు సరిపోవడం లేదు.
  • యూనిఫారు, పుస్తకాలకు సొమ్ము ఎవరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అదనపు ఖర్చును భరించడానికి పాఠశాలలు బోధన రుసుమును పెంచుతుండడంతో మధ్యతరగతి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు.
  • ప్రయివేటు పాఠశాలల్లో రిజర్వేషన్ల వ్యవహారం వ్యక్తిగత సమస్యలా కనిపిస్తున్నా, అది పలు అంశాలపై కోర్టు తీర్పు ఇవ్వాల్సినంత సంక్ష్లిష్టంగా మారిందని వ్యాఖ్యానించింది. 

views: 890

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams