Current Affairs Telugu Daily

TSRTC కార్మికులకు 16% మధ్యంతర భృతి 
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.
  • జులై 1 నుంచి వేతనంలో కలిసి వీటిని విడుదల చేయాలని ఆదేశించారు.
  • సకల జనుల సమ్మె కాలం నాటి బకాయిలను నగదు రూపంలో రెండు మూడు రోజుల్లో విడుదల చేయాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలిచ్చారు.
  • అశక్తులైన డ్రైవర్లు, కండక్టర్ల వారసుల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, చిన్నచిన్న కారణాలకే జరిగిన సస్పెన్షన్లు, బదిలీలను కమిటీ వేసి సమీక్షించాలని సూచించారు.
  • ఆర్టీసీని బలోపేతం చేసేందుకు నిపుణుల కమిటీని వేయాలని నిర్దేశించారు. 
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి - పట్నం మహేందర్‌రెడ్డి
TSRTC ఛైర్మన్‌ - సోమారపు సత్యనారాయణ 
TSRTC-Telangana State Road Transport Corporation

views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams