Current Affairs Telugu Daily

నీటిలోని మలినాలను వడబోసే కొత్త పదార్థాలు గుర్తింపు
నగరాల్లోని మురికి నీటిలో మలినాలను 24 గంటల్లోనే వడపోసే సరికొత్త పదార్థాలను పరిశోధకులు గుర్తించారు. నీటి సమస్యకు ఇవి చక్కటి పరిష్కారం చూపే అవకాశముంది. స్పెయిన్‌లోని సెవిల్లీ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు.
  • రెండు రకాల ఫైలో సిలికేట్లపై వారు దృష్టిసారించారు.
  • వీటిలో మొదటిది సింథటిక్‌ మైకా (ఎన్‌ఏ-మైకా4).
  • రెండోది ధనావేశపూరిత మైకా (సీ18-మైకా4).
  • వీటి సాయంతో మురికినీరు, మంచినీటిలోని మలినాలను వడపోశారు. దీంతో పారిశ్రామిక మలినాలు మొదలుకొని యాంటీబయోటిక్స్‌, సౌందర్య, ఔషధ ఉత్పత్తులు తదితర పదార్థాలకు సంబంధించిన అవశేషాలను సీ18-మైకా4 సమర్థంగా తొలగించగలుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
  • మొత్తంగా 18 రకాల రసాయనిక కాలుష్య కారకాలపై రెండు ఫైలో సిలికేట్లూ సమర్థంగా పనిచేస్తున్నట్లు బయటపడింది.
  • ఫైలో సిటికేట్లు... సిలికేట్ల వర్గంలోకి వస్తాయి. వీటిలో భిన్నరకాల ఖనిజాలుంటాయి.

views: 1073

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams