Current Affairs Telugu Daily

దక్షిణాఫ్రికాలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పర్యటన
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీని శ్వేత జాత్యాహంకారంతో రైలు పెట్టెలోంచి తోసేసి 125 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సుష్మాస్వరాజ్‌ కీలకోపన్యాసం ఇచ్చారు.
  • పెన్‌ట్రిచ్‌ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ స్టేషన్‌ వరకు సుష్మాస్వరాజ్‌ రైల్లో ప్రయాణించారు. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
  • రెండు వైపులా గాంధీ ముఖం ఉండడం ఈ విగ్రహం ప్రత్యేకత. ఒక వైపు యువకుడిగా ఉన్నప్పటి ముఖం, మరోవైపు ఇప్పుడు మనందరికీ తెలిసిన ముఖం ఉన్నాయి.
  • మహాత్మాగాంధీ డిజిటల్‌ ప్రదర్శనశాలను కూడా ప్రారంభించారు. ‘సత్యాగ్రహ ఉద్యోమోదయం’ పుస్తకాన్ని మంత్రి విడుదల చేశారు.
  • రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు ప్రారంభమయి 25 సంవత్సరాలయిన సందర్భాన్ని పురస్కరించుకుని సుష్మాస్వరజాజ్‌, దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ ఉప మంత్రి లువెలెన్‌ లాండర్స్‌తో కలిసి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, ఆలివర్‌ టాంబో స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.
  • గాంధీని రైలు పెట్టెలోంచి తోసేసిన సంఘటన 1893, జూన్‌ 7న జరిగింది. ఆ నాటి సంఘటనే గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నాంది అయింది.
  • ఆ తర్వాతే ఆయన దక్షిణాఫ్రికాలో, భారత్‌లో శాంతియుత నిరసన ఉద్యమాన్ని ప్రారంభించారు. 

views: 886

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams