Current Affairs Telugu Daily

పదో ఏడాది ముకేశ్‌ అంబానీ వేతనం రూ.15 కోట్లు
భారత కుబేరుల్లో అగ్రగణ్యుడు ముకేశ్‌ అంబానీ తన వార్షిక వేతనాన్ని వరుసగా పదో ఏడాది కూడా రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు.
  • 2017-18లో కూడా అంతే మొత్తాన్ని అందుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్‌ అన్నీ కలిపి రూ.15 కోట్లే తీసుకుంటున్నారు.
  • దాదాపు ఏటా రూ.24 కోట్లను వదులుకుంటున్నారు. నిఖిల్‌, హితాల్‌ మేస్వానీలలతో పాటు కంపెనీ ఇతర శాశ్వత డైరెక్టర్ల వేతనాలు మాత్రం 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగాయి. ‘యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి వ్యక్తిగత ఉదాహరణగా ముకేశ్‌ అంబానీ నిలిచారు.
  • అందుకే రూ.15 కోట్లకే వేతనాన్ని పరిమితం చేసుకున్నార’ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
  • సీఈఓ వేతన పరిమాణాలపై చర్చ నేపథ్యంలో 2009 అక్టోబరులో అంబానీ తన వేతనాన్ని స్వచ్ఛందంగా రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.
  • ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ.. ఈయన మాత్రం ఆ మొత్తానికే కట్టుబడి ఉన్నారు.

views: 820



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams