Current Affairs Telugu Daily

బాలల  సంరక్షణకు 174 సహాయ కేంద్రాలు 
బాలల  సంరక్షణకు రైల్వే బోర్డు, బాలల  హక్కుల పరిరక్షణ జాతీయ కమిషను(NCPCR) సంయుక్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించాయి.
  • ఇప్పటికే ఉన్న 88 రైల్వేస్టేషన్లలకు అదనంగా మరో 174 స్టేషన్లలలో బాలల  సహాయ కేంద్రాల ఏర్పాటుకు నిశ్చయించాయి.
  • రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల , వ్యాపారులు , కూలీలకు ప్రచారం కల్పించే కార్యక్రమాన్ని రైల్వేబోర్డు ఛైర్మన్‌ అశ్వని లొహాని, NCPCR ఛైర్‌పర్సన్‌ స్తుతికక్కర్‌ 2018 జూన్‌ 7న ప్రారంభించారు.
  • తప్పిపోయినా, ఎవరైనా వదిలేసినా, పారిపోయి వచ్చినా, అక్రమంగా రవాణా చేస్తున్న బాలలను గుర్తించడానికి వీరి సహాయం తీసుకోనున్నారు.
  • అలాంటి బాలలను గుర్తించి సహాయకేంద్రం ఉన్న రైల్వేస్టేషన్‌లో అప్పగిస్తే, చిన్నారు యోగక్షేమాలు  చూస్తారు.
  • అవసరమైతే సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు.
  • 2017లో ఇలా 35 వేల మందిని రక్షించారు.
  • ఒక్క 2017-18లోనే 11 వేల మంది బాలలను సంరక్షించారు.
  • సగటున ప్రతిరోజూ 25 మందిని రక్షిస్తున్నారు.
NCPCR- National Commission for Protection of Child Right

views: 879



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams