Current Affairs Telugu Daily

అత్యధిక శాతం మహిళా మంత్రులున్న యూరప్‌ దేశంగా స్పెయిన్‌
అత్యధిక శాతం మహిళా మంత్రులున్న యూరప్‌ దేశంగా స్పెయిన్‌ చరిత్ర సృష్టించింది.
  • స్పెయిన్‌లో సోషలిస్ట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తన కేబినెట్‌లో 11మంది మహిళలకు, ఆరుగురు పురుషులకు స్థానం కల్పించారు.
  • వీరంతా స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-6 సమక్షంలో 2018 జూన్‌ 7న ప్రమాణస్వీకారం చేశారు.
  • ముడుపు, అవినీతి ఆరోపణతో ఇటీవల  ప్రధాని పదవి నుంచి తప్పుకున్న మరియానో రజోయ్‌ స్థానంలో శాంచెజ్‌ బాధ్యతలు  చేపట్టారు.
  • ఇప్పటివరకు యూరప్‌లో అత్యధిక మహిళా మంత్రులున్న దేశంగా ఫిన్‌లాండ్‌ ఉండేది.
  • ఇప్పుడు స్పెయిన్‌ ఆ ఘనత దక్కించుకుంది.

views: 822

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams