Current Affairs Telugu Daily

గ్వాటెమాలాలో బద్దలైన ఫ్యూగో అగ్నిపర్వతం
మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది.
  • లావాలో చిక్కుకొని 25 మంది మృతి చెందారు.
  • 3,763 మీటర్ల ఎత్తుండే ఫ్యూగో 2018 ఫిబ్రవరిలో బద్దలవ్వడంతో ఆకాశంలోకి 1.7 కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడింది.
  • ఫ్యూగో నుంచి 2018 జూన్‌ 3న వెలువడిన ప్రాణాంతక లావా దాదాపు 8 కిలోమీటర్ల వరకు నది తరహాలో ప్రవహించింది.
  • దీంతో అక్కడికి సమీపంలోని ఎల్‌ రొడియో అలొటెనంగో, శాన్‌ మిగ్వెల్‌ లాస్‌ లోటెస్‌ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూల  ప్రభావం పడింది.
  • పొలాల్లో పనిచేస్తున్న పువురు లావాలో కూరుకుపోయి మృత్యువాతపడ్డారు.
  • దట్టమైన పొగ, బూడిద చుట్టుపక్క ప్రాంతాలను కమ్మేసింది. 

views: 1039



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams