Current Affairs Telugu Daily

అఫ్గానిస్థాన్‌లో సగం మంది బాలలు విద్యకు దూరం : యునిసెఫ్‌
ఉగ్రవాదంతో అతలాకుతలం అవుతున్న అఫ్గానిస్థాన్‌లో దాదాపు సగంమంది బాలబాలిలకు విద్యకు దూరంగా ఉంటున్నారని యునిసెఫ్‌ నివేదిక వెల్లడించింది.
  • 2002 తరువాత ఈ స్థాయిలో విద్యకు దూరవడం ఇదే మొదటిసారి అని నివేదిక తెలిపింది. 2018 పూర్తి అయ్యేలోపలు మరో మూడు లక్షల మంది పాఠశాలకు టాటా చెప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
  • భద్రత కొరవడటం, పేదరికం, లింగవివక్ష కారణంగా అధికంగా విద్యకు దూరమవుతున్నారని విశ్లేషించింది. ముఖ్యంగా ఏడు నుంచి 17 ఏళ్ల వయస్సుగల 37 లక్షల మంది బాలికల్లో 60 శాతం ప్రాథమిక విద్యకు సైతం దూరమయ్యారని తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 85శాతం వరకు ఉందంది. సమాజంలో బాల్యవివాహాలు, ఉపాధ్యాయురాళ్లు లేకపోవడం ప్రభావం చూపిస్తున్నాయని తెలిపింది.
  • పొరుగున ఉన్న పాకిస్థాన్‌, నేపాల్‌తో పోలిస్తే 85 శాతం మంది అఫ్గాన్‌ బాలబాలిలకు ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారని వెల్లడించింది.

views: 934

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams