Current Affairs Telugu Daily

రాష్ట్రపతి కోవింద్‌ తిరస్కరణకు గురైన తొలి క్షమాభిక్ష అభ్యర్థన 
మరణశిక్ష పడిన ఓ వ్యక్తి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరణకు గురైన తొలి క్షమాభిక్ష అభ్యర్థన ఇదే అవుతుంది. రాష్ట్రపతి వద్ద ఇప్పుడిక ఈ తరహా పిటిషన్‌లేవీ పెండింగ్‌లో లేవు.
  • ఓ గేదె అపహరణ వ్యవహారంలో చెరేగిన వివాదంతో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులను సజీవ దహనం చేసిన జగత్‌రాయ్‌ అనే వ్యక్తికి చివరకు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది.
  • 2006లో బిహారులోని వైశాలి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. తన గేదెను అపహరించారంటూ మహతో అనే వ్యక్తి జగత్‌రాయ్‌, వజీర్‌రాయ్‌, అజయ్‌రాయ్‌ అనే ముగ్గురిపై కేసు పెట్టారు.
  • ఆ కేసును ఉపసంహరించుకోవసిందిగా అతడిపై నిందితుల ఒత్తిడి తెచ్చారు. అందుకు మహతో నిరాకరించడంతో కక్షపెంచుకున్న జగత్‌రాయ్‌ ఓ రోజు రాత్రి మహతో ఇంటికి నిప్పంటించాడు.
  • ఆ ఘటనలో మహతో భార్య...అయిదుగురు చిన్నారుల సజీవదహనమైనారు. తీవ్రంగా కాలిపోయిన మహతో ఆ తర్వాత కొన్నాళ్లకు మరణించాడు.

views: 991

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams