Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌ కంటే యూట్యూబ్‌ వాడకమే ఎక్కువ
యువత ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేయడం కంటే యూట్యూబ్‌లో వీడియోలు చూడ్డంలోనే ఎక్కువగా నిమగ్నమవుతోందని ప్యూ పరిశోధన కేంద్రం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 13-17 ఏళ్ల వయసు యువతీ యువకుల్లో 85% మంది యూట్యూబ్‌ వీడియోను చూడ్డంలోనే ఎక్కువ సమయం గడుపుతుండగా,  ఆ తర్వాత 72% మంది ఇన్‌స్టాగ్రాంలో, 69% మంది స్నాప్‌చాట్‌లో, 51% మంది ఫేస్‌బుక్‌లో సమయం వెచ్చిస్తున్నట్లు తేలింది. అమెరికన్లలో 95% మందికి స్మార్ట్‌ఫోన్‌ వాడకం తెలుసునని, 43% మంది నిత్యం ఇంటర్నెట్‌ను వాడుతున్నారని పేర్కొంది. సామాజిక మాధ్యమం వల్ల మంచే ఎక్కువని వారిలో 31% మంది, చెడు ఎక్కువని 24% మంది నమ్ముతున్నట్లు నివేదిక వెల్లడించింది. 
views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams