Current Affairs Telugu Daily

‘ది ప్రిజనర్‌ ఇన్‌ హిజ్‌ ప్యాలెస్‌: సద్దాం హుస్సేన్‌’: బిల్‌ బర్డన్‌వేర్పర్‌
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇరాక్‌ను పాలించిన నియంత సద్దాం హుస్సేన్‌ తన చివరి రోజుల్లో అమెరికా గార్డులతో ఎంతో స్నేహ పూర్వకంగా ఉండేవారట. సద్దాం గురించి అమెరికన్‌ గార్డు బిల్‌ బర్డన్‌వేర్పర్‌ ‘ది ప్రిజనర్‌ ఇన్‌ హిజ్‌ ప్యాలెస్‌: సద్దాం హుస్సేన్‌’ పేరుతో రాసిన పుస్తకంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ప్రస్తావించారు. ఆరు నెలల పాటు సద్దాంకు కాపలాగా ఉన్న 12 మంది అమెరికన్‌ సైనికులు అతడితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన చనిపోయేవరకూ సైనికులు స్నేహపూర్వకంగానే మెలిగినట్లు ఆ పుస్తకంలో రాశారు. జైలు గది బయట ఒక మూలన కూర్చొని ఎంజాయ్‌ చేసేవారని, అందమైన పూలను చూస్తూ సంతోషంగా సమయాన్ని గడిపేవారని బర్డన్‌వేర్పర్‌ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
  • ‘ది ప్రిజనర్‌ ఇన్‌ హిజ్‌ ప్యాలెస్‌: సద్దాం హుస్సేన్‌’ రచయిత బిల్‌ బర్డన్‌వేర్పర్‌

views: 1016

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams