Current Affairs Telugu Daily

సైబరాబాద్‌ డీసీపీ జానకీ షర్మిలకు ఐటీ వార్షిక అవార్డు
ఐటీ కారిడార్‌లో మహిళా భదత్ర, మానవ అక్రమ రవాణాల నిర్మూనకు కృషి చేసినందుకు సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్స్‌) జానకీ షర్మిలకు ఐటీ వార్షిక అవార్డు లభించింది.
  • తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని ఐటీ శాఖ ఈ అవార్డును ప్రకటించింది.
  • హైదరాబాద్‌ 2018 జూన్‌ 1న నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ జానకీ షర్మిలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
  • జానకీ షర్మిల సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్స్‌)తో పాటు సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
  • 2007లో డీఎస్పీగా పోలీసు శాఖలో చేరిన ఆమె.. మహిళా భద్రత, మానవ అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా అనేక చర్యలు చేపట్టారు.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వ్యభిచార గృహా నుంచి 163 యువతులను రక్షించారు.
  • సైబరాబాద్‌ పరిధిలో జరిగిన అభయ, స్నేక్‌ గ్యాంగ్‌, చాందినిజైన్‌ హత్య కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు.
  • రంగారెడ్డి జిల్లాలో మూగ, బధిరుల పాఠశాలను నిర్వహిస్తున్నారు.

views: 1039



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams