Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ సీఓఈ
సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో హైదరాబాద్‌లో ఎక్సెలెన్స్‌ కేంద్రాన్ని (సీఓఈ) ఏర్పాటు చేయనున్నారు.
  • ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (DSCI)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దీన్ని అభివృద్ధి చేస్తారు.
  • హైదరాబాద్‌ను సైబర్‌ సెక్యూరిటీ సేవలకు కేంద్రం చేసే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
  • వినూత్న సొల్యుషన్లను అభివృద్ధి చేయడం, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఈ రంగంలో అంకుర కంపెనీలను నెలకొల్పడం, నైపుణ్యాల పెంపు మొదలైన అంశాలపై ఈ కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తుంది.
  • పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వాన్ని ఒక గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు డీఎస్‌సీఐ కృషి చేస్తుంది.
DSCI-Data Security Council of India

views: 1071

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams