Current Affairs Telugu Daily

భారత్‌ సహా 39 దేశాల్లో పెన్సిలిన్‌ కరవు
చాలా దేశాల్లో యాంటీ బయాటిక్స్‌ కొరత నెలకొందని యాక్సెస్‌ టు మెడిసిన్‌ ఫౌండేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.
  • ఫలితంగా ప్రాథమిక ఆరోగ్యం చిక్కుల్లో పడి౦దని పేర్కొంది. భారత్‌ సహా 39 దేశాల్లో ముఖ్యమైన పెన్సిలిన్‌ ఔషధం లభ్యం కావట్లేదని తెలిపింది.
  • ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.
  • ‘‘2001-13 మధ్య అమెరికాలో 148 రకాల యాంటీ బయాటిక్స్‌ కొరత నెలకొంది.
  • 2010లో 15 దేశాల్లో క్షయ నివారణకు అవసరమైన సూదిమందు లభ్యం కాలేదు.
  • 2015 నుంచి 39 దేశాల్లో ముఖ్యమైన పెన్సిలిన్‌ రకం అసలు దొరకడమే లేదు.
  • ఇప్పుడు భారత్‌, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, అమెరికాలూ ఈ జాబితాలో చేరిపోయాయి.
  • యాంటీ బయాటిక్స్‌ మార్కెట్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఔషధాలకు కొరత ఏర్పడుతోంది. 

views: 907

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams