Current Affairs Telugu Daily

స్పెయిన్‌ ప్రధాని మరియానో రాజొయ్‌ రాజీనామా
అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్‌ దేశ ప్రధాని మరియానో రాజొయ్‌ 2018 జూన్‌ 1న తన పదవికి రాజీనామా చేశారు.
  • ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత పెడ్రో సాంచెజ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • రాజొయ్‌కు చెందిన పాపులర్‌ పార్టీపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సోషలిస్టు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
  • దీనికి సోషలిస్టులను వ్యతిరేకించే ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో ఓటమి అనివార్యమయింది.
  • పరిస్థితులను గమనించిన రాజొయ్‌ పదవి నుంచి తప్పుకొన్నారు.

views: 941



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams