Current Affairs Telugu Daily

భారతీయ-అమెరికన్‌ కార్తీక్‌కు స్పెల్లింగ్‌ బీ టైటిల్‌ 
స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ 91వ టైటిల్‌ విజేతగా భారతీయ-అమెరికన్‌ బాలుడు కార్తీక్‌ నెమ్మాని(14) నిలిచాడు.
  • తుదిపోటీలో క్రైస్తవ సమ్మేళనం అనే అర్థం వచ్చే koinonia అనే పదానికి తప్పుల్లేకుండా స్పెల్లింగ్‌ చెప్పి ఈ విజయం సాధించాడు.
  • వరుసగా 11వ సారి భారతీయ-అమెరికన్‌ ఈ పోటీ విజేతగా నిలిచాడు.
  • 8వ తరగతి (గ్రేడర్‌) చదువుతున్న టెక్సాస్‌లోని మెక్‌కిన్నేకు చెందిన కార్తీక్‌ మరో భారతీయ-అమెరికన్‌ విద్యార్థి నైసా మోడిపై తుది రౌండ్‌లో విజయం సాధించాడు.
  • స్పెల్లింగ్‌ బీ విజేతగా నిలవడం ద్వారా కార్తీక్‌ స్రైప్స్‌ బీ నుంచి 40 వేల డాలర్ల (సుమారు రూ. 26.85 లక్షలు) నగదు బహుమతి, ట్రోఫీతో పాటు మెరియమ్‌-వెబ్‌స్టార్‌ నుంచి 2,500 డాలర్లు అందుకున్నాడు.

views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams