Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో సంయుక్త సహకార వ్యవసాయ సంస్థ రద్దు 
సంయుక్త సహకార వ్యవసాయ సంస్థను (కో-ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీ- CJFS) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది.
  • వీటి పరిధిలో భూములను సాగు చేస్తున్న వారికి డీకే పట్టాలను ఇవ్వాలని నిర్ణయించింది.
  • వీరి కుటుంబ సభ్యులకు లేదా వారసులకు ఇచ్చేందుకు అంగీకరించింది.
  • ఈ మేరకు రెవెన్యూశాఖ2018 జూన్‌ 1 ఉత్తర్వులను జారీ చేసింది. 
  • ఇప్పటివరకు సీజేఎఫ్‌ఎస్‌ ద్వారా భూములు పొందిన వారికి వాటిపై హక్కులు లేవు.
  • ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారే ఎక్కువ.
  • ఇలాంటివారికి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పించింది.
  • ప్రభుత్వ భూములను ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారికి రాష్ట్రవ్యాప్తంగా 1975 నుంచి 1980 మధ్య అప్పగించారు.
  • ఇందుకోసం ప్రత్యేకంగా సీజేఎఫ్‌ఎస్‌ను ఏర్పాటు చేసి, కేవలం భూములను సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
  • ఇలా..రాష్ట్రవ్యాప్తంగా 2.2 లలక్ష ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములు ఉన్నట్లు గుర్తించారు.
  • ఇందులో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 99,500 ఎకరాలను 65వేల మంది ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు ఇచ్చారు.
  • దశాబ్దాల నుంచి వీరే సాగుచేసుకుంటున్నా ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో సీజేఎఫ్‌ఎస్‌గా చూపుతున్నారు.
  • ఈ భూముల స్థానంలో డి-పట్టాలను జారీచేయాని నెల్లూరు జిల్లా కలెక్టరు ముత్యారాజు భూ పరిపాలన శాఖకు నివేదించారు.
  • దీనిపై పరిశీలన జరిపిన ఆ శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులను జారీ చేసింది.
  • ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ పాసుపుస్తకం జారీ అవుతుంది.
  • బ్యాంకు నుంచి పంట రుణాలను పొందే అవకాశం వస్తుంది.
  • ప్రభుత్వ పథకాలకూ అర్హత సాధిస్తారు. రెవెన్యూ అధికారులకు రికార్డు నిర్వహణపరంగా సులువవుతుంది.
  • ఈ భూములను ప్రభుత్వం తన పరిధిలోనికి తీసుకున్నట్లయితే నష్టపరిహారం పొందేందుకు అర్హత సాధిస్తారు.
CJFS-Co Operative Joint Farming Societies

views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams