Current Affairs Telugu Daily

భారత ప్రధాని నరేంద్రమోడి సింగపూర్‌ పర్యటన
3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 జూన్‌ 1న సింగపూర్‌లో పర్యటించారు.
  • సింగపూర్‌ అధ్యక్ష భవనం ఇస్టానాలో మోడికి ఘనస్వాగతం లభించింది.
  • దేశాధ్యక్షురాలు హలీమా యాకోబ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
  • అనంతరం ప్రధాని లీ సీన్‌ లూ౦గ్‌తో సమావేశమయ్యారు.
  • ఈ సందర్భంగా, ఉభయదేశాల నావికాదళాల మధ్య రవాణా సహకారం సహా 8 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
  • ఆర్థిక, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి భారత ప్రధాని నరేంద్రమోడి, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూ౦గ్‌లు అంగీకారం తెలిపారు.
  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నిష్పాక్షిక, స్నేహపూర్వక నావికాల వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషిచేయాలని నిర్ణయించారు.
  • 6వ శతాబ్దానికి చెందిన బుద్ధగుప్తుని శిలాప్రతిమను లూ౦గ్‌కు మోడి బహుకరించారు.
  • సింగపూర్‌ మాజీ రాయబారి టామీ కోహ్ కు మోడి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
  • ఇండియా-ఆసియాన్‌ భాగస్వామ్యం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 2018 గణతంత్ర దినోత్సవం నాడు టామీకి భారత్‌ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
  • షాంగ్రిలా డైలాగ్‌లో మోడి కీలకోపన్యాసం చేశారు. భారత్‌-చైనాలు పరస్పర నమ్మకం, విశ్వాసంతో కలిసి పనిచేస్తే ఆసియాకూ, పంచానికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందని మోడి పేర్కొన్నారు.
  • నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో ‘ఆవిష్కరణ ద్వారా ఆసియా రూపాంతరీకరణ’పై మోడి ప్రసంగించారు.
  • సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి గొంతులను అందిస్తోందనీ, సామాజిక విభజనను రూపుమాపడంలో కీలక భూమిక పోషిస్తోందని మోడి అన్నారు.
  • 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి మానవీయ విలువతో కూడిన ఆవిష్కరణలు అవసరమన్నారు.
  • పలు భారతీయ విశ్వవిద్యాయాలు, ఎన్‌టీయూ మధ్య 6 విద్య, పారిశ్రామిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
  • అనంతరం అక్కడి ప్రదర్శనలో కొలువుదీరిన మనుషులతో మాట్లాడే రోబోతో మోడి సంభాషించారు.
  • వేప చెట్టును నాటారు.

views: 940



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams