Current Affairs Telugu Daily

పురుగు మందు నిషేధంతో రైతుల ఆత్మహత్యల నివారణ
భారత్‌లో పేద రైతుల ఆత్మహత్యలను నివారించాంటే అత్యంత ప్రమాదకరమైన పురుగు మందులను నిషేధించాలని ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాయం నిపుణులు అభిప్రాయపడ్డారు.
  • ఆ విశ్వవిద్యాయంలోని సెంటర్‌ ఫర్‌ పెస్టిసైడ్‌ సూసైడ్‌ ప్రివెన్షన్‌(పురుగుమందు ద్వారా జరిగే ఆత్మహత్య నివారణ కేంద్రం)కు చెందిన నిపుణులు ఈ మేరకు 15 పేజీల నివేదికను కేంద్ర వ్యవసాయకులు పంపారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన సామాజిక కార్యకర్తల కవితా కురుగంటి ద్వారా వారు ఈ నివేదికను అందజేశారు.
  • అధికారిక గణాంకాల ప్రకారం 2014లో భారత్‌లో నమోదైన 1,31,666 ఆత్మహత్యల్లో 14,352 పురుగు మందు తాగే ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
  • ఇక్కడ అంచనాలు చాలా తక్కువ చేసి చూపారు. 2010లో ఓ సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఆ ఏడాది జరిగిన 1.87 లక్షల ఆత్మహత్యల్లో 49.2% (92,000) పురుగు మందు తాగడం వల్లే జరిగినట్లు తేలింది.
  • ఇందులోనూ మీథైల్‌ పారథాన్‌, మోనోక్రోటోఫాస్‌, డయాజినాన్‌, పాస్పోమిడాన్ల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు.
  • అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పురుగుమందు కేవలం అనుమతి ఉన్న వారికీ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • భారత్‌లో అందుకు భిన్న మైన పరిస్థితి ఉంది. ఇలాంటి పురుగు మందును నిషేధించడం వల్ల శ్రీంకలో ఆత్మహత్యలు తగ్గాయి.
  • అల్ల్యుమినియం ఫాస్పైడ్‌ను 1970 చివరలో వ్యవసాయ వినియోగానికి అనుమతించిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఆత్మహత్యలు వీపరీతంగా పెరిగాయి. అందువల్ల దీనిని నిషేధించాలి.
  • పురుగు మందు తాగినవారిని బతికించడానికి అత్యంత ఖరీదైన వైద్య సేలు అవసరం కావడం వల్ల బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది.
  • భారతదేశంలో ప్రస్తుతం ఏటా 40 వేల మంది పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
  • ఇందులో అత్యధిక మంది పేదలే ఉంటున్నారు.
  • ప్రమాదకరమైన పురుగు మందును నిషేధిస్తే ఇలాంటి వారి ప్రాణాలు కాపాడినట్లవుతుందని పేర్కొన్నారు.

views: 930

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams