Current Affairs Telugu Daily

పొగాకు వినియోగంలో భారత్‌కు 2వ స్థానం
పొగాకు వినియోగంలో భారత్‌కు 2వ స్థానం పొగతాగే వారి సంఖ్యలో భారత్‌ 2వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది.
  • ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 మే 31న ‘ట్రెండ్స్‌ ఇన్‌ ప్రివెలెన్స్‌ ఆఫ్‌ లొబాకో స్మోకింగ్‌ 2000-2025 పేరిట నివేదికను విడుదల  చేసింది.
  • ప్రపంచ వ్యాప్తంగా 15 సం॥ల కు పైబడిన వ్యక్తులు  ధూమపాన అలవాట్లను విశ్లేషించింది.
  • ఈ నివేదిక ప్రకారం పొగ తాగే వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో, ఇండోనేసియా తృతీయ స్థానంలో నిలిచింది.  
  • ప్రపంచవ్యాప్తంగా పొగ తాగేవారి సంఖ్య ` 110 కోట్లకు పైనే  ప్రపంచవ్యాప్తంగా పొగరహిత పొగాకు వినియోగిస్తున్న వారి సంఖ్య 36.7 కోట్లు (పురుషులు `23.7 కోట్లు, స్త్రీలు `12.9 కోట్లు). వీరిలో 20 కోట్ల మంది భారత్‌లో ఉన్నారు.  
  • ప్రాంతాల వారీగా పొగరహిత పొగాకు వినియోగంలో 30.1 కోట్ల మంది(82%)తో ఆగ్నేయాసియా మొదటి స్థానంలో ఉంది.  
  • 2000తో పోలిస్తే పొగాకు వినియోగం ప్రస్తుతం తగ్గింది. 2000లో మొత్తం జనాభాలో 27%గా వున్న ఈ సంఖ్య 2016 నాటికి 20%కు తగ్గింది.  
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 70 లక్షల  మంది ధూమపానంతో మరణిస్తున్నారు.

views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams