Current Affairs Telugu Daily

ఆక్సిజన్‌ సిలిండర్లు లేకుండానే ఎవరెస్టునెక్కిన సైనికులు
ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం లేకుండానే ఆ నలుగురూ....చకచకా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతశిఖరం ఎవరెస్టును ప్రాణవాయువు సిలిండర్లు లేకుండానే ఎక్కిన తొలిబృందంగా ప్రత్యేకత సాధించారు. కంచోక్‌ టెండా, కేల్‌షాంగ్‌ దోర్జీ బూటియా, కాల్డెన్‌ పంజుర్‌, సోనం ఫన్‌స్టోక్‌లు నలుగురూ భారతసైనికులే. వాస్తవానికి ప్రాణవాయువు సిలిండర్ల అవసరమే లేకుండా మొత్తం 14 మంది సభ్యుల బృందం ఎవరెస్టు అధిరోహణకు ప్రయత్నం చేసింది. ఇందులో ఈ నలుగురు అదనపు ప్రాణవాయువు సరఫరాల అవసరం లేకుండా ఎక్కేయగా...మరో ముగ్గురు ఆక్సిజన్‌ సిలిండర్ల సాయంతో అధిరోహించారు. మే నెల 21న ఎవరెస్టును ఎక్కిన ఈ బృందం కాఠ్‌మాండూకు తిరిగి వచ్చింది.
  • ఆక్సిజన్‌ సిలిండర్ల లేకుండానే అదిరొహించినవారు- కంచోక్‌ టెండా, కేల్‌షాంగ్‌ దోర్జీ బూటియా, కాల్డెన్‌ పంజుర్‌, సోనం ఫన్‌స్టోక్‌

views: 807

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams