Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి స్పెషల్‌ జ్యూరీ అవార్డు 
రాష్ట్ర ప్రజల  భద్రత, శాంతి భద్రతలే లక్ష్యంగా రూపొందించి అమలుచేస్తోన్న పలు సాంకేతిక సేవలకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు   జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
  • ఏపీ డీజీపీ మాలకొండయ్యకు స్పెషల్‌ జ్యూరీ అవార్డు లభించింది.
  • మొత్తం 14 సేవల్ని అమలు చేస్తోన్న ఏపీ పోలీసు శాఖ ఆరింటిలో అవార్డు దక్కించుకుంది.
  • ఎక్కువ ప్రజాదరణ పొందిన లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంకు జాతీయ స్థాయిలో అభినందన లభించింది.
  • ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు యాప్‌ను రూపొందించిన చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబకు రెండు అవార్డులు దక్కాయి.
  • ఈ-వెరిఫై విధానం అమలుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకి, అఫెండర్స్‌ సర్వెలెన్స్‌ చేస్తున్న అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌కు అవార్డు లభించింది.
  • వీటితోపాటు పీఐఎన్‌ఎస్‌  పేరుతో సీజ్‌ అయిన ఆస్తికి విముక్తి కల్పించే విధానం అమల్లోకి తెచ్చిన ఐజీ సంజయ్‌కు అవార్డు లభించింది.
  • ఏటా ధిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందజేస్తారు.
  • జ్యూరీ అవార్డును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ డీజీపీ మాల కొండయ్యకు అందజేశారు.

views: 935

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams