Current Affairs Telugu Daily

ముషరాఫ్‌కు పాస్‌పోర్టు రద్దు
పాకిస్తాన్‌ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరాఫ్‌ పాస్‌పోర్టును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది.
  • కోర్టు ఆదేశాల  మేరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
  • రాజ్యద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషరాఫ్‌ పాస్‌పోర్టును రద్దు చేయాలని 2018 మే 31న ప్రభుత్వాన్ని ఆదేశించింది.
  • జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు  జారీ చేసింది.
  • ముషరాఫ్‌ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజ్యద్రోహం కేసు నమోదయింది.
  • ముషరాఫ్‌ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేమీ జరపకుండా ఉండాలనే లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు  జారీ చేసినట్టు విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.
  • నేషనల్‌ డేటా బేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ పాస్‌పోర్టు డైరెక్టరేట్‌ కోర్టు ఆదేశాల  మేరకు చర్యలు  ప్రారంభించాయి.
  • కోర్టు ఆదేశాలు  అమల్లోకి వస్తే ముషరాఫ్‌ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కొల్పోవడంతోపాటు, బ్యాకింగ్‌ సేవలను వినియోగించుకోలేరు.

views: 862

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams