Current Affairs Telugu Daily

ఈయూ, కెనడా, మెక్సికోపై  అమెరికా దిగుమతి సుంకాల  మినహాయింపు ఎత్తివేత 
యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), కెనడా, అమెరికా నుంచి వచ్చే ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై సుంకాల  మినహాయింపును ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
  • 2018 జూన్‌ 1 నుంచి ఈ చర్య అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ పేర్కొన్నారు.
  •  దీనిపై ప్రతీకార చర్యలు  ఉంటాయని ఈయూ, కెనడా, మెక్సికోలు  హెచ్చరించాయి.
  • ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.
  • ఉక్కుపై 25 శాతం,  అల్యుమినియంపై 15%  చొప్పున  దిగుమతి సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 మార్చిలో  ప్రకటించారు.
  • అయితే ఒక నెలరోజుల  పాటు కెనడా, మెక్సికో, ఈయూకు తాత్కాలికంగా అందుకు మినహాయింపునిస్తున్నట్లు 2018 ఏప్రిల్‌ 30న ప్రకటించారు.
  • ఈ వ్యవధిలో చర్చకు విల్లుంటుందని  వారు భావించారు.
  • యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, మెక్సికోతో అనుకున్న విధంగా చర్చల్లో  ప్రగతి కనిపించలేదని రాస్‌ పేర్కొన్నారు.
  •  చైనా పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఉక్కుపై 25%, అల్యుమినియంపై 15% చొప్పున అమెరికా దిగుమతి సుంకాలన్ని విధించింది.
  • కొత్త సుంకల  విధానం వల్ల అమెరికాతో స్నేహంగా ఉండే దేశాలపైనా ప్రభావం పడనుంది.
  • వాణిజ్యానికి ‘ఇదో చెడ్డ రోజు’ అని అమెరిక    అను  ఈయూ  అభివర్ణించింది.
  • అమెరికా కఠిన సుంకాలపై అతి త్వరలోనే ప్రతిచర్యులుంటాయని
           హెచ్చరించింది.
  • అర్జైంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌కు నిరవధిక మినహాయింపునిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ఉక్కు  సుంకాల   నుంచి దక్షిణ కొరియాకు శాశ్వత
           మినహాయింపునిచ్చింది.

views: 1533

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams