Current Affairs Telugu Daily

టైమ్స్‌ ప్రపంచ విద్యాసంస్థ జాబితాలో IISc బెంగళూరుకి చోటు
టైమ్స్‌ ప్రపంచస్థాయి ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌-2018లో భారత్‌ నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc-బెంగళూరు), 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది.
  • భారత్‌ నుంచి IISc-బెంగళూరు మాత్రమే జాబితాలో నిలిచింది.
  • 91-100 స్థానాల మధ్య IIScకి చోటు దక్కింది.
  • ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థపై 2018 జనవరి నుంచి మార్చి వరకు 10 వేల మంది సీనియర్‌ విద్యావేత్తలు ఈ సర్వే నిర్వహించారు.
  • జాబితాలో అమెరికన్‌ విశ్వవిద్యాయాలు హార్వర్డ్‌, మసాచుట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్‌ఫర్డ్‌బీ యూకేకు చెందిన కేంబ్రిడ్జ్‌, ఆక్స్‌ఫర్డ్‌లు తొలి 5 స్థానాల్లో నిలిచాయి.
  • యూకే నుంచి 2017లో 10 విద్యాసంస్థలకు చోటుదక్కగా ఈసారి 9 మాత్రమే జాబితాలో నిలిచాయి. 
  • డర్హమ్‌ విశ్వవిద్యాయం చోటు కోల్పోయింది.
  • బెంగళూరులోని ఐఐఎస్‌సీ 1909లో కేవలం 2 విభాగాల (జనరల్‌ అండ్‌ అప్లైడ్‌ కెమిస్ట్రీ, ఎక్ట్రికల్‌ టెక్నాజీ)తో ప్రారంభమైంది.
IISc-Indian Institute of Science

views: 880

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams