Current Affairs Telugu Daily

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం
పినాక రాకెట్‌కు సంబంధించిన మెరుగుపరచిన వెర్షన్‌ను భారత్‌ 2018 మే 31న విజయవంతంగా పరీక్షించింది.
  • ఒడిశాలోని చాందీపూర్‌లో నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష జరగడం ఇది వరుసగా రెండోరోజు.
  • బహుళ రాకెట్‌ ప్రయోగ లాంచర్‌ నుంచి ఈ రాకెట్‌ దూసుకెళ్లింది. మునుపటి పినాక వ్యవస్థలో మార్గనిర్దేశ సౌభ్యం లేదు.
  • తాజాగా దీన్ని దిక్సూచి, మార్గనిర్దేశ, నియంత్రణ కిట్‌ను జోడి౦చారు.
  • ఈ కిట్‌ను హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన ప్రయోగశాల రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) అందించింది.
  • ఈ జోడి౦పు వ్ల పినాక పరిధి, కచ్చితత్వం బాగా పెరిగాయి.
  • లోగడ ఇది 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలిగేది.
  • ఇప్పుడు అది 70 కిలోమీటర్లకు పెరిగింది.
  • తాజా పరీక్షలో రాడార్లు, ఎక్ట్రో-ఆప్టికల్‌ వ్యవస్థలు, టెలీమెట్రీ వ్యవస్థలు ఈ రాకెట్‌ గమనాన్ని ఆసాంతం పరిశీలించాయి.
  • బహుళ రాకెట్‌ ప్రయోగ వేదిక నుంచి శరపరంపరగా కూడా దీన్ని ప్రయోగించవచ్చు.
  • 44 సెకన్ల వ్యవధిలో 12 రాకెట్లు దూసుకెళ్లగవు.
  • DRDO-Defence Research and Development Organisation
  • RCI-Research Centre Imarat

views: 953



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams