Current Affairs Telugu Daily

CSIR-IICT  సరికొత్త నానో, అల్ట్రా టెక్నాజీతో జల శుద్ధి విధానాలు
మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేలా సరికొత్త నానో, అల్ట్రా టెక్నాజీతో జల శుద్ధి విధానాలను భారత రసాయన సాంకేతిక సంస్థ (CSIR-IICT) తయారు చేసింది.
  • ఈ ప్లాంట్ల ద్వారా లీటరు నీటి శుద్ధికి అయ్యే ఖర్చు 3 నుంచి 4 పైసలు మాత్రమే.
  • ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతుల్లో మాదిరిగా ఇది నీటిలోని అన్నిరకాల లవణాలనూ తొలగించేయదు.
  • మానవ శరీరానికి అవసరమైన లవణాలను మాత్రం ఉంచి హాని కలిగించే హెవీ మెటల్స్‌ను, బాక్టీరియాను పూర్తిగా తొలగించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.
  • ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్‌ పెరుగుతోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రివర్స్‌ ఆస్మోసిస్‌(RO) టెక్నాలజీ కంటే మరింత భిన్నమైన సాంకేతికతతో సురక్షిత నీటిని ప్రతి ఒక్కరికి అందించే ధ్యేయంతో CSIR-IICT సీనియర్‌ శాస్త్రవేత డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌ పదిహేనేళ్లుగా పరిశోధనలు మొదలుపెట్టారు.
  • ఇదే సంస్థ చాలా రోజుల క్రితం ఆర్వో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.
  • తెలంగాణలోని నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోనూ, ఏపీలోని ప్రకాశం జిల్లాల్లోనూ ఈ సాంకేతికతతో ఎన్నో ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
  • అవి నీటిలోని ఫ్లోరైడ్‌ను తొలగించి సురక్షిత నీటిని అందించడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి.
  • ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆర్వో ప్లాంట్లు నీటిలోని అన్నిరకాల లవణాలనూ తొలగించేస్తున్నాయి.
  • లవణరహితమైన నీటిని తాగితే భవిష్యత్తులో ఆరోగ్యపరమైన కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ఈ నేపథ్యంలో శుద్ధి చేసిన నీటిలో లవణాలను మాత్రం కాపాడుతూ.. బాక్టీరియాతోపాటు శరీరానికి హాని చేసే హెవీ మెటల్స్‌ను పూర్తిగా తొలగించే సాంకేతికత కోసం శ్రీధర్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలను చేసింది.
  • చివరికి భూగర్భ జలాల శుద్ధి కోసం నానో టెక్నాజీని, కృష్ణా, గోదావరి జలాల శుద్ధికి అల్ట్రా టెక్నాజీని రెండురకాల అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
  • ఈ రెండు విధానాలూ కూడా నీటిలో మానవ శరీరానికి ఉపయోగపడే లవణాలను తొలగించకుండా హెవీ మెటల్స్‌ను, బాక్టీరీయా, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తాయని వెల్లడి౦చారు.
  • అపార్టుమెంట్లు, పాఠశాలలు తదితరాల్లో ఉపయోగించేందుకు వీలుగా 50 నుంచి 100 లీటర్ల సామర్థ్యం గల మినీ ప్లాంటులను శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • వీటి ఏర్పాటుకు రూ. 60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంది.250-300 లీటర్ల ప్లాంట్‌కు రూ. లక్ష, వెయ్యి లీటర్ల ప్లాంట్‌కు రూ. 3 లక్షల వ్యయం అవుతుంది.
  • కనిష్ఠంగా లీటరు నీటికి మూడు పైసలు మాత్రమే ఖర్చవుతుంది. మూడేళ్ల వరకు ఎటువంటి నిర్వహణ అవసరం లేదు.
  • మూడో సంవత్సరం తరువాత కొద్దిపాటి మొత్తాన్ని హెచ్చిస్తే సరిపోతుందని చెబుతున్నారు.వీటితో పోల్చుకుంటే ప్రైవేటుగా ఏర్పాటయ్యే ఆర్వో ప్లాంట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి.
  • ప్రైవేటుగా ఏర్పాటయ్యే ప్లాంట్లలో లీటరుకు 10 పైసల వరకు అవుతుంది.
  • CSIR-Council of Scientific and Industrial Research
  • IICT-Indian Institute of Chemical Technology
  • RO-Reverse osmosis

views: 904



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams