Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన 2018 మే 31న అమరావతిలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.
కేబినెట్‌ నిర్ణయాలు
  • రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లింపునకు నిర్ణయం.
  • డిగ్రీ, డిప్లొమా చదివిన వారికి ఈ భృతి అందించాని నిర్ణయం తీసుకుంది. 
అర్హులు 
  • దారిద్య్రరేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్నవారు. 
  • డిగ్రీ, డిప్లొమా చదివినవారు. 
  • 22 - 35 ఏళ్ల మధ్య వయసువారు.
విధివిధానాలు 
  • కుటుంబంలో ఎందరు అర్హులున్నా అందరికీ చెల్లింపు. 
  • నెలకు రూ.1000 చొప్పున చెల్లింపు. 
  • నిరుద్యోగ భ్రుతితోపాటు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
  • బయోమెట్రిక్‌ ద్వారా బ్యాంకు ఖాతాకే నగదు. 
  • వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ఆహ్వానం.
  • దరఖాస్తు సమయంలోనే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న నైపుణ్య విభాగాల ఎంపిక. 
  • ప్రజా సాధికార సర్వే ప్రకారం ఉన్న 10 లక్షల మంది కంటే ఎక్కువ ఉంటే వారికీ చెల్లింపు.
  • ఆటోమ్యుటేషన్‌ విధానం అమలుకు, చిన్న, సన్నకారు రైతుల పాత విక్రయ దస్తావేజును స్టాంపు డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఆమోదంఆటో మ్యుటేషన్‌ అమలు కోసం పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం - 1971కు సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • కొత్త విధానం ప్రకారం.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో క్రయవిక్రయాల వివరాలను అప్పటికప్పుడు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తారు.
  • వీటిని తహశీల్దారు కార్యాలయంలో 30 రోజులు పరిశీలనకు ఉంచుతారు.
  • అభ్యంతరాలు రాకుంటే మ్యుటేషన్‌ అయిపోతుంది.
  • ప్రస్తుత విధానంలో పొలం రిజిస్ట్రేషన్‌ జరిగిన అనంతరం రెవెన్యూ అధికారుల ద్వారా పాస్‌ పుస్తకాల్లో నమోదు చేయించుకోవాల్సి వస్తోంది.
  • వివిధ కారణాల వల్ల భూముల క్రయవిక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకోని (సాదాబైనామా) చిన్న, సన్నకారు రైతుల దస్తావేజులను స్టాంపు డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అనుమతి 2014 జూన్‌ 2వ తేదీకి (రాష్ట్ర విభజన) ముందు జరిగిన లావాదేవీలకే స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఐదెకరాల్లోపు వ్యవసాయ భూములకే ఇది వర్తిస్తుంది.
  • ప్రకటన వేలవడిన తేదీ నుంచి 45 రోజులపాటు స్టాంపు డ్యూటీ లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వీలు కల్పిస్తారు.
  • గ్రామ, మండల స్థాయిలో సమగ్ర విచారణ జరిపి సహేతుకం అని తేల్చిన లావాదేవీలకే అనుమతి ఉంటుంది.

views: 988

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams