Current Affairs Telugu Daily

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాలకు ప్రకటన 
18,428 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకమండలి (TSPLRB) 2018 మే 31న ప్రకటన జారీ చేసింది.
  • ఇందులో పోలీసుశాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలతో పాటు అగ్నిమాపక విపత్తు నివారణ, జైళ్లశాఖ, ప్రత్యేక పోలీసుల విభాగానికి చెందిన స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, డిప్యూటీ జైర్‌, వార్డర్‌, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ పోస్టు కూడా భర్తీ చేయనున్నారు.
  • రాష్ట్ర విభజన తర్వాత 2016లో మొదటిసారి దాదాపు 10వేల పోలీసు ఉద్యోగాలకు TSPLRB ప్రకటన విడుదల చేసింది.
  • దీనిద్వారా ఎంపికైన కానిస్టేబుళ్లు ఇప్పటికే విధుల్లో చేరగా ఎస్సై అభ్యర్థుల శిక్షణ కొనసాగుతోంది. 
ఎస్సై ఉద్యోగాలకు అర్హతలు 
  • వయో పరిమితి (2018 జులై 1 నాటికి) పోలీసుశాఖలో ఎస్సై పోస్టుకు 21 సంవత్సరాలు నిండి, 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.
  • 1993 జులై 2, 1997 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. అగ్నిమాపక విపత్తు నివారణశాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుకు 2018 జులై 1నాటికి 18 సంవత్సరాలు నిండి, 30 ఏళ్లలోపు ఉండాలి.
  • 1988 జులై 2, 2000 సంవత్సరం జులై 1వతేదీ మధ్య జన్మించి ఉండాలి. జైళ్లశాఖలో డిప్యూటీ జైర్‌ పోస్టుకు 21 సంవత్సరాలు నిండి, 30 ఏళ్లలోపు ఉండాలి. 1988 జులై 2, 1997 జులై 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. జైళ్లశాఖలో అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ పోస్టుకు 21 సంవత్సరాలు నిండి, 25 ఏళ్లలోపు ఉండాలి. 1993 జులై2, 1997 జులై1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలు 
  • గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీలైతే ఇంటర్‌ లేదా తత్సమానమైన కోర్సు చదివి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • వీరు మాత్రం పాలిటెక్నిక్‌ వంటి దాని తర్వాత డిగ్రీ చేసి ఉండాలి.
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఎస్సై పోస్టుకు అభ్యర్థులు ఎక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎక్ట్రికల్‌ అండ్‌ ఎక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలలో ఏదో ఒకదానిలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి.
  • వేలిముద్ర విభాగంలో అయితే కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒక పాఠ్యాంశంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఫీజు 
  • ఎస్సై, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైర్‌, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే తెలంగాణకు చెందిన ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000. 
  • ఎస్సీ, ఎస్టీలైతే రూ.500 
  • మిగతా అభ్యర్థులకు రూ.1000. 
  • టి.ఎస్‌.ఆన్‌లైన్‌, ఏపీ ఆన్‌లైన్‌, మీసేవా లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు.
కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హతలు
వయోపరిమితి (2018 జులై 1 నాటికి) 
  • కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18 ఏళ్లు నిండి, 22 ఏళ్లలోపు ఉండాలి.
  • 1996 జులై 2, 2000 సంవత్సరం జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
  • హోంగార్డుగా పనిచేస్తున్న వారైతే 18 సంవత్సరాలు నిండాలి. 40 ఏళ్లలోపు ఉండాలి.
  • అగ్నిమాపకశాఖలో ఫైర్‌మెన్‌, జైళ్లశాఖలో వార్డర్లు(పురుషులు, మహిళలు) పోస్టుకు 18 సంవత్సరాలు నిండి, 30 సంవత్సరాలోపు వయసుండాలి.
  • 1988 జులై 2, 2000 జులై 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.
  • పోలీసుశాఖలో సివిల్‌, ఎ.ఆర్‌.తోపాటు జైళ్లశాఖలో వార్డర్ల పోస్టుకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించారు.
  • వితంతువు, చట్టబద్ధంగా విడాకులు పొందిన మహిళలైతే 18 ఏళ్లు నిండి, 40 సంవత్సరాలోపు ఉండాలి.
విద్యార్హతలు 
  • ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీలైతే పదో తరగతి పూర్తిచేసి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం చదివి ఉంటే చాలు.
ఫీజు వివరాలు 
  • తెలంగాణకు చెందిన ఓసీ, బీసీలైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400, మిగతా అభ్యర్థులేతే రూ.800 చెల్లించాలి.
  • అన్ని పోస్టులకూ www.tslprb.in ద్వారా ఆన్‌లైన్‌లోనే 2018 జూన్‌ 9 నుంచి జూన్‌ 30వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
  • రిజర్వేషన్ల విధానం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • ప్రాథమిక రాత పరీక్షలో అర్హత లభించిన వారికి దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.
  • ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి తుది పరీక్ష నిర్వహిస్తారు.
  • టి.ఎస్‌.పి.ఎస్‌. విభాగంతోపాటు డ్రైవర్ల వంటి ఉద్యోగాలను పురుషులకు మాత్రమే కేటాయించారు.
  • మిగతా అన్ని పోస్టులు పురుషులు, మహిళలూ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి సడలింపు లేదు 
  • గత 2016 ఉద్యోగ ప్రకటనలో పోలీసు ఉద్యోగాలకు నాలుగేళ్ల వయోపరిమితి సడలింపునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
  • కానీ ప్రస్తుత ప్రకటనలో అలాంటి సడలింపు ఏదీ ఇవ్వలేదు.
TSLPRB-Telangana State Level Police Recruitment Board 

views: 1087

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams