ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తపై మహిళకు ఫేస్బుక్-NCW శిక్షణ
ఇంటర్నెట్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వినియోగించుకోవడంపై మహిళకు ఫేస్బుక్ సంస్థ, జాతీయ మహిళా కమిషన్ (NCW) సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నాయి.
సైబర్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ‘డిజిటల్ అక్షరాస్యత’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.
మొదట ప్రయోగాత్మకంగా హర్యానా, డిల్లీ-దేశ రాజధాని ప్రాంతం, మణిపుర్, సిక్కిం, మేఘాలయ, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని వివిధ విశ్వవిద్యాయల్లో 60 వేల మంది మహిళకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటర్నెట్, ఈ-మెయిల్, సోషల్ మీడియా వాడకంపై సమాచార విశ్వసనీయతను గుర్తించడంపై స్థానిక భాషల్లో బోధించనున్నారు.
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదు బాగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళకు ఈ తరహా శిక్షణ ఇస్తున్నారు.