Current Affairs Telugu Daily

మైనర్‌ పిల్లలపై సంరక్షకులకు సంపూర్ణ అధికారాలేమీ ఉండవు: సుప్రీంకోర్టు
మైనర్‌ పిల్లలపై సంరక్షకులకు సంపూర్ణ అధికారాలేమీ ఉండవని, ఆ పిల్లల అభీష్టాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • మైనర్‌ బాలిక/బాలుడిపై సంరక్షకులకు పూర్తి అధికారాలు ఉంటాయని, ఎవరి ఆలనాపాలనలో ఉండాలనుకునే విషయంలో వారు(మైనర్లు)స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేదానికి లేదంటూ గుజరాత్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది.
  • గుజరాత్‌ హైకోర్టు వ్యక్తం చేసిన తీర్పుతో తాము ఏకీభవించడం లేదని జస్టిస్‌.ఏకే.సిక్రి, జస్టిస్‌. అశోక్‌భూషణ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టంగా పేర్కొంది.
  • ఒక్కసారి మైనర్‌ బాలిక/బాలుడికి సంరక్షకుడిని నియమించిన తర్వాత సదరు మైనర్లకు తాము ఇష్టపడిన వారి వద్ద ఉండాలని కోరుకునేవీలులేదనడం సబబు కాదేమోనని వ్యాఖ్యానించింది.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ దీపక్‌మిశ్రా

views: 825



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams