Current Affairs Telugu Daily

CBSE పదో తరగతి ఫలితాలు విడుదల 
కేంద్ర మాధ్యమిక విద్యామండలి (CBSE) 10వ తరగతి పరీక్ష ఫలితాలు 2018 మే 29న విడుదలయ్యాయి. 16 లక్షలకుపైగా మంది ఈ పరీక్షలు రాయగా.. వీరిలో 86.7% మంది ఉత్తీర్ణులయ్యారు. 88.67% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో నిలిచారు. బాలురలో 85.32% మంది ఉత్తీర్ణులయ్యారు. నలుగురు విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించారు. ప్రాకార్‌ మిత్తల్‌ (గురుగ్రామ్‌), రిమ్జిమ్‌ అగర్వాల్‌ (బిజ్నోర్‌), నందిని గార్గ్‌ (షామ్లి), జి.శ్రీలక్ష్మి (కోచి) 500కు గానూ 499 మార్కులు సాధించారు.
  • అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం కనబరిచిన ప్రాంతాల జాబితాలో తిరువనంతపురం (99.6%), చెన్నై (97.37%), అజ్‌మేర్‌ (91.86%) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 
  • CBSE ఛైర్‌ పర్సన్‌ - అనిత కార్వాల్‌
CBSE-Central Board of Secondary Education

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams