తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు(PNGRB) నిర్ణయించింది.
తొలిదశలో ఆయా జిల్లా కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు.
2020 నాటికి దేశంలోని కోటి ఇళ్లకు ఈ విధానంలో గ్యాస్ సరఫరా చేయాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 174 జిల్లాల్లో పైప్లైన్ల విస్తరణకు PNGRB బిడ్స్ ఆహ్వానించింది.
ఆ ప్రక్రియలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో 2018 మే 29న రోడ్‌షో నిర్వహించింది.
తెలంగాణ (20 జిల్లాలు)
భద్రాది-కొత్తగూడెం
ఖమ్మం
జగిత్యాల
పెద్దపల్లి
కరీంనగర్
రాజన్న సిరిసిల్ల
జనగాం
జయశంకర్ భూపాల్పల్లి
మహబూబాబాద్
వరంగల్ పట్టణం
వరంగల్ గ్రామీణం
మెదక్
సిద్ధిపేట
సంగారెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి
రంగారెడ్డి
వికారాబాద్
నల్గొండ
సూర్యాపేట
యాదాద్రి-భువనగిరి
ఆంధ్రప్రదేశ్ (3 జిల్లాలు)
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
PNGRB- Petroleum and Natural Gas Regulatory Board
views: 840