Current Affairs Telugu Daily

RBI CFOగా సుధా బాలకృష్ణన్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తొలిసారిగా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)ను నియమించింది.
  • ఇటీవలి వరకు నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన సుధా బాలకృష్ణన్‌ను మూడేళ్ల పదవీకాలానికి RBI నియమించింది.
  • ఈ పదవీ కాలాన్ని పెంచే వీలు  కూడా ఉంది.
  • 2018 మే 15 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది.
  • RBI 12వ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా సుధా వ్యవహరిస్తారు.
  • ప్రావిడెండ్‌ ఫండ్‌కు సంబంధించి విధానాలు , పీఎఫ్‌ వడ్డీరేట్ల విభాగాలను ఆమె పర్యవేక్షిస్తారు.
RBI-Reserve Bank of India
CFO-Chief Financial Officer

views: 1124



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams