Current Affairs Telugu Daily

ISI మాజీ అధిపతిపై పాకిస్థాన్‌లో ఆంక్షలు 
పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ISI మాజీ అధిపతి, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అసద్‌ దుర్రానీపై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆంక్షలు  విధించింది.
  • దేశం విడిచి వెళ్లకుండా నియంత్రణ వర్తించే వ్యక్తల  జాబితాలో ఆయన పేరును చేర్చింది.
  • భారతదేశ నిఘా విభాగ మాజీ అధిపతితో కలిసి ‘స్పై క్రానికల్స్‌’ అనే పుస్తకం రచించడంపై కోర్ట్‌-ఆఫ్‌-ఎంక్వైరీని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ- లెఫ్టినెంట్‌ జనరల్‌ నేతృత్వంలో న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.
  • ISI ప్రధాన కార్యాలయానికి దుర్రానీని పిలిపించి, సంజాయిషీ కోరింది.
  • ఈ పరిణామాపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
  • ఉగ్రవాదం, ముంబయి దాడు, కశ్మీర్‌, నిఘా సంస్థ ప్రభావం వంటి అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు. 
ISI-Inter Services Intelligence

views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams