Current Affairs Telugu Daily

వీణా సహజ్‌వాలాకు ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ 
భారత సంతతి శాస్త్రవేత్త వీణా సహజ్‌వాలాకు 2018 సం॥నికి గాను ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ లభించింది.
  • శాస్త్రీయ రంగంలో రీసైక్లింగ్‌ విధానాల్లో విప్లవాత్మక విధానాలను కనుగొన్నందుకు ఆమెకు ఈ ఫెలోషిప్‌ వచ్చింది.
  • సిడ్నీలోని  న్యూ సౌత్‌ వేల్స్‌ విశ్వవిద్యాయంలో ఆమె ప్రస్తుతం సైన్స్‌ విభాగంలో అసోసియేట్‌ డీన్‌గా పనిచేస్తున్నారు.
  • ఈ-వ్యర్థాల నిర్వహణ విషయంలో ప్రశంసనీయమైన పరిశోధలను చేసిన ఆమె 2018 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ-వ్యర్థాల  మైక్రో ఫ్యాక్టరీని ప్రారంభించారు. 

views: 929Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams