Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా నసీరుల్‌ ముల్క్‌ 
పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నసీరుల్‌ ముల్క్‌ నియమితులయ్యారు.
  • తాత్కాలిక ప్రధాని ఎంపికపై పాకిస్థాన్‌ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
  • నసీరుల్‌ ముల్క్‌ను 2 నెలల పాటు తాత్కాలిక ప్రధానిగా నియమించడానికి ఇరుపక్షాలు 2018 మే 28న అంగీకరించాయి.
  • 2018 మే 31తో పాకిస్థాన్‌ ప్రభుత్వం కాలపరిమితి తీరిపోనుంది.
  • అప్పటి నుంచి పాలన వ్యవహారాలతో పాటు 2018 జులై 25న పార్లమెంటుకు, ప్రావిన్సుకు ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఇకపై నసీరుల్‌ ముల్క్‌దే.
  • నసీరుల్‌ ముల్క్‌  ఎంపికను పాక్‌ ప్రధాని అబ్బాసీ, ప్రతిపక్షనాయకుడు ఖుర్షీద్‌ఖాన్‌ అధికారికంగా వెల్లడి౦చారు.
  • గతంలో ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిగా పనిచేసిన ముల్క్‌ తటస్థలంగా వ్యవహరిస్తారని రాజకీయవర్గాల్లో పేరు ఉంది. 

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams