Current Affairs Telugu Daily

టీడీపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు బహిష్కరణ
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును ఆ పార్టీ బహిష్కరించింది.
  • పార్టీకి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుండడం వల్ల ఆయనను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ జాతీయాధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడి౦చారు.
  • ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా 2018 మే 28న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించిన మోత్కుపల్లి సమాధిపై వాలిపోయి కన్నీరు పెట్టుకున్నారు.
  • అక్కడే విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కుట్రకే ఎన్టీఆర్‌ బలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  • చంద్రబాబు రాజకీయాల కోసమే ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటూ నందమూరి వంశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
  • పార్టీపరంగా ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.
  • దీనిపై అధినేత చంద్రబాబు స్పందించారు.
  • పార్టీ నియామవళి, క్రమశిక్షణ పాటించనందున మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 
  • తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు - ఎల్‌.రమణ

views: 821

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams