Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాలు 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 2018 మే 27న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. 
  • తెలంగాణ 7 జోన్లు, వాటికి సంబంధించిన 2 బహుళ జోన్లతో రూపొందించిన కొత్త విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • ఇకపై ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలు  జిల్లా, జోన్‌, బహుళ జోన్లకే పరిమితం చేయాని, రాష్ట్ర స్థాయి పోస్టును కచ్చితంగా పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని తీర్మానించింది.
  • తెలంగాణలో ఇకపై విద్య, ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక, అయిదు శాతం ఓపెన్‌ కేటగిరి రిజర్వేషన్లను చేపట్టాలని నిర్ణయించింది.
  • రైతుకు జీవిత బీమా పథకం చేపట్టడానికి, వైద్య కళాశాల్లోని ఆచార్యుల  వయోపరిమితి 65 సంవత్సరాలకు పెంపునకు అంగీకారం తెలిపింది.
  • ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. 
కేబినెట్‌ నిర్ణయాలు  
తెలంగాణలో ప్రస్తుతం 2 జోన్లు ఉండగా ఇకపై వాటి స్థానంలో 7 కొత్త జోన్లు ఏర్పడతాయి.
  • మొదటి 4 జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన 3 జోన్లను రెండో బహుళజోన్‌లుగా పరిగణిస్తారు.
  • ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా పరిగణిస్తారు.
  • మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.
  • రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలుండవు.
  • పదోన్నతులే.
  • ప్రస్తుతం 4 నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు.
  • ఇకపై 1 నుంచి 7 తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు.
  • రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లా, జోన్లు, బహుళజోన్ల పరిధిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.
  • ప్రస్తుతం తెలంగాణలో జిల్లా కేడర్‌లో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళజోనల్‌ కేడర్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
  • ఇక జిల్లా, జోనల్‌, బహుళజోనల్‌ పరిధిలో 95 శాతం స్థానిక, 5శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి.
  • రాష్ట్ర కేడర్‌ పోస్టు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదు.
  • రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి రైతుకు రూ.5 లక్ష జీవితబీమా పథకం నిర్వహణకు అనుమతిస్తూ మంత్రిమండలిలో తీర్మానించారు.
  • ఎల్‌ఐసీ ద్వారా దీనిని అమలుచేస్తారు.
  • ప్రతి రైతుకు రూ.2,271 చొప్పున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి ఈ పథకాన్ని నిర్వహిస్తుంది.
  • ప్రీమియంకు చెల్లించే మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తారు.
  • జూన్‌  నుంచి రైతు నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా ధ్రువపత్రాలు అందజేస్తారు.
  • వైద్య కళాశాల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి 58 నుంచి 65 సంవత్సరాలకు పెంపు .
  • రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు 14 మంది సిబ్బంది నియామకానికి అనుమతి.
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు కేటాయింపు, కొత్తగా దేవాదుల, తుపాకులగూడెం కార్పొరేషన్‌ ఏర్పాటు ఉత్తర్వులకు ఆమోదం.

views: 1035



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams