Current Affairs Telugu Daily

సిజేరియన్‌ కాన్పులకు ప్రభుత్వ ఆసుపత్రుల అనుమతి తప్పనిసరి 
కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(NHPM) కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్‌ కాన్పు చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రి అనుమతి అవసరం. దీనికి సంబంధించి కారణాలను వివరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రే సదరు గర్భిణిని అక్కడికి పంపాలి. పడకలు లేదా మానవ వనరుల కొరత లేక మరేదైనా ఇతర సమస్య కారణంగానే ఇలా చేయాల్సి ఉంటుంది. సహజ కాన్పులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆయుష్మాన్‌ భారత్‌-NHPM ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇందు భూషణ్‌ వెల్లడించారు.
  • NHPM కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేర కవరేజీ ఉంటుంది. సహజ కాన్పులు దీని పరిధిలోకి రాబోవని భూషణ్‌ తెలిపారు. సాధారణ కాన్పు వల్ల తల్లి లేదా బిడ్డకు ప్రమాదమని భావించినప్పుడే సిజేరియన్‌ కాన్పును చేయాల్సి ఉంటుందన్నారు.
  • ఒక్కో దేశంలో 10-15 శాతం మేర మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్సలు ఆమోదయోగ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని పేర్కొన్నారు. అయితే భారత్‌లో వీటిని విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఇవి ఎక్కువగా సాగుతున్నాయని పేర్కొన్నారు. NHPM కింద సిజేరియన్‌ కాన్పుకు మూల రేటును రూ.9 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు.
  • 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం.. సిజేరియన్‌ కాన్పుల్లో 40.9 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరిగాయి. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో 11.9 శాతమే జరిగాయి.
NHPM- National Health Protection Mission

views: 869

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams