Current Affairs Telugu Daily

చంద్రుడిపై కాలుమోపిన వ్యోమగామి అలెన్‌ బీన్‌ మృతి
చంద్రుడిపై కాలుమోపిన నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందిన అమెరికా వ్యోమగామి అలెన్‌ బీన్‌ (86)  2018 మే 26న వాషింగ్టన్‌ లో మృతి చెందారు.
  • అలెన్‌ లావెర్న్‌ బీన్‌ 1932 మార్చి 15న టెక్సాస్‌లోని వీర్‌లో జన్మించారు. మొదట నౌకాదళంలో టెస్ట్‌ పైట్‌గా చేరారు.
  • 1963లో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో వ్యోమగామి అయ్యారు.
  • చంద్రుడిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కాలుమోపిన నాలుగు నెలలకు 1969 నవంబర్‌ 14న బీన్‌ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లారు.
  • అపోలో-12 పేరిట సాగిన ఆ యాత్రలో ఆయనతోపాటు కన్రాడ్‌, రిచర్డ్‌ గోర్డాన్‌లు కూడా పాలుపంచుకున్నారు.
  • 1970 చివర్లో ఆయన వ్యోమగామి శిక్షణ విభాగానికి అధిపతి అయ్యారు.
  • ఆ తర్వాత నాసా నుంచి పదవీవిరమణ పొంది, చిత్రలేఖనంపై దృష్టిపెట్టారు.
  • అంతరిక్షం, చంద్రుడి ఉపరితలం వంటి అంశాలపై ఆయన బొమ్మలు గీశారు. 

views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams