Current Affairs Telugu Daily

భర్త వేతన వివరాలు తొలుసుకునే హక్కు భార్యకుంది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు
భార్యకు తన భర్త జీతం గురించి తప్పకుండా తొలుసుకునే హక్కు ఉందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు పేర్కొంది.  
  • భర్త నుంచి విడిగా ఉంటున్న సునీతా జైన్‌ అనే మహిళ తనకు ఇస్తున్న మనోవర్తి మొత్తాన్ని పెంచాలంటూ అభ్యర్థించిన కేసులో హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
  • సునీత భర్త బీఎస్‌ఎన్‌ఎల్‌లో సీనియర్‌ అధికారి అనీ....ఆయన అధిక వేతనాన్ని పొందుతున్నప్పటికీ భార్యకు మనోవర్తిగా కేవలం  రూ.7 వేలను మాత్రమే ఇస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
  • ఈ సందర్భంగా భర్త వేతన వివరాలతో కూడిన పే స్లిప్‌ కోసం అభ్యర్థించగా కింది కోర్టు అందుకు నిరాకరించింది.
  • దాంతో, ఆమె సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం అభ్యర్థించి విజయం సాధించారు.
  • అయితే, ఈ మేరకు కేంద్ర సమాచార సంఘం ఇచ్చిన ఉత్తర్వులను భర్త హైకోర్టులో సవాలు చేశారు.
  • ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ భర్త వేతన వివరాలు తొసుకునే హక్కు భార్యకు కచ్చితంగా ఉందని స్పష్టం చేసింది.

views: 844



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams